బాలకృష్ణ 'చరిత్రకు ఒక్కడు'
on Apr 17, 2015
.jpg)
ఈ తరం టాప్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే 100 సినిమాల మైలురాయిని చేరుకున్నారు. చిరంజీవి తర్వాత ఆ ఘనతకు చేరువవుతోంది నందమూరి నటసింహం బాలకృష్ణే.. త్వరలో విడుదల కానున్న ‘లయన్’తో బాలయ్య 98 సినిమాలు పూర్తి చేస్తున్నట్లవుతోంది. ఈలోగానే ఆయన 99వ సినిమా కూడా రెడీ అవుతోంది. శ్రీవాస్ దర్శకత్వంలో ‘డిక్టేటర్’ పేరుతో 99వ సినిమా చేస్తున్నారు.బాలకృష్ణ ఇప్పుడు ‘డిక్టేటర్’ తర్వాత తన 100వ సినిమాపై దృష్టి పెడుతున్నారు. దీనికి ‘చరిత్రకు ఒక్కడు’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. ఎన్టీఆర్ వారసుడిగా నందమూరి కుటుంబం కీర్తి ప్రతిష్టలను పెంచి చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన బాలయ్య 100వ సినిమాకు ‘చరిత్రకు ఒక్కడు’ టైటిల్ చక్కగా సరిపోతుందని అభిమానులు అంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



