బిగ్ బాస్ విన్నర్ కౌశల్.. బాబు గోగినేని స్పందన
on Aug 16, 2018
బిగ్ బాస్ మొదటి సీజన్ లాగానే రెండో సీజన్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. అయితే ఈ సీజన్లో అందరి చూపు కౌశల్ మీద ఉంది.. ఇది గేమ్, నేను గేమ్ ఆడటానికే వచ్చానని చెప్పిన కౌశల్.. అన్నట్టుగానే ముందు నుండి తన మనసుకు నచ్చినట్టు గేమ్ ఆడుతూ, ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్నాడు.. అయితే రీసెంట్ గా బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన బాబు గోగినేని, కౌశల్ గెలుపు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.
'కౌశల్ నాకు కాంపిటేషన్ అని అనుకోలేదు ఎందుకంటే నేను చివరిదాకా ఉంటానన్న కాన్ఫిడెన్స్ నాకు లేదు.. నేను ష్యూర్‌గా చెప్పగలను కౌశల్ ఫైనలిస్టులో ఒకడని.. నాకు దానిలో ఎలాంటి అనుమానం లేదు.. చూస్తుంటే ఆయనకు సపోర్ట్ కూడా అలాగే ఉంది.. ఏ కారణాల వల్ల అయినా ఇంట్లో కూడా ఆయనకు సపోర్ట్ బాగా ఉన్నట్టుగా నేను బయటకు వచ్చేటప్పటికి నాకు అర్థమైంది. మీకు అన్యాయం జరిగింది అని ఆడవారితో అంటే ‘మాకేం అన్యాయం జరిగింది?’ అన్నారు.. ఆయనకు సపోర్ట్ ఉంది అనడాన్ని ఇది స్పష్టంగా తెలియజేస్తోంది.. ప్రజల్లో కూడా సపోర్ట్ ఉందేమోనని ఓటింగ్ ట్రెండ్స్ చూస్తే అర్థమవుతోంది.. ఆయన్ను గెలవనివ్వండి.. దట్స్ ఓకే.. ఎవరో ఒకరు గెలవాలి కదా’ అని బాబు గోగినేని అన్నారు.