కబాలిలు, సుల్తాన్లు "బాహుబలి" ముందు బలాదూరే
on Mar 17, 2017
టాలీవుడ్‌తో పాటు ప్రపంచం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన బాహుబలి ద కన్‌క్లూజన్ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తుందని సినీ విశ్లేషకులు వేసిన అంచనాలకు మించి జక్కన్నకు సాటి లేదని థియేటర్లలోనే కాదు యూట్యూబ్‌లోనూ సంచలనం సృష్టిస్తోంది బాహుబలి ట్రైలర్. ఇంతవరకూ మరే భారతీయ చిత్రాలేవీ అందుకోలేని స్థాయిలో వ్యూస్‌ని దక్కించుకుని గత చిత్రాల రికార్డులను తెరమరుగు చేస్తోంది.
నిన్న ఉదయం 10 గంటల సమయంలో విడుదలైన ఈ ట్రలర్, కేవలం ఎనిమిది గంటల్లోనే 10 మిలియన్ అంటే 1 కోటి వ్యూస్‌ని అందుకుంది. కోటి వ్యూస్ అందుకున్న టీజర్లు, ట్రైలర్లు చాలా ఉన్నాయి కాని, కేవలం 8 గంటల్లోనే కోటి మార్క్‌ను టచ్ చేసింది. ఇంతకు ముందు సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి 24 గంటల్లో కోటి క్లిక్స్‌ను అందుకోగా, బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ సుల్తాన్‌కు 17 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఇప్పుడు ఆ రికార్డులను బాహుబలి-2 తుడిచిపెట్టేసింది. దీనిని బట్టి ఈ సినిమా కోసం దేశం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తోందో అర్థం చేసుకోవచ్చు. జయహో బాహుబలి.