English | Telugu

ప్రభాస్‌ను వెన్నుపోటులు వదలడం లేదా..?

on Jun 20, 2017

బాహుబలి-1 సినిమా చూసొచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి మెదళ్లను తొలిచేసిన పజిల్ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే..ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం కోసం కోట్లాదిమంది బాహుబలి-2 కోసం వెయిట్ చేశారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు పొడిచాడో తెలుసుకుని డౌట్ క్లియర్ చేసుకున్నాడు. తాజాగా మరో వ్యక్తి ప్రభాస్‌ను వెనుక నుంచి కత్తితో పొడిచాడు. ఈ ఘటన నిన్న జరిగింది. ఆ ఫోటోలు బయటకు రావడంతో ప్రజంట్ అవి వైరల్‌గా మారాయి.

అసలేం జరిగిందంటే బాహుబలిని హిందీలో రిలీజ్ చేసిన బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహర్ తన ఇంట్లో పెద్ద పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీకి ప్రభాస్‌ వస్తున్నాడని తెలిసి బాలీవుడ్ సెలబ్రిటీలు కరణ్‌జోహర్ ఇంటికి పరుగులు తీశారు. ఎందుకంటే బాహుబలితో ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. అతనితో పరిచయం కోసం..అక్కడివారు ఎదురుచూస్తున్నారు. పార్టీలో ప్రభాస్‌తో సరదాగా గడిపిన వారంతా కట్టప్ప బాహుబలిని పొడిచిన కత్తితో ప్రభాస్‌ను పొడిచాడు వరుణ్ ధావన్. అందుకు ప్రభాస్ కూడా అచ్చం అదే ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. దీనిని మిగిలిన వారు ఫోటో తీసి వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ పిక్ వైరల్ అయ్యింది.

 


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here