అక్కడ తప్ప అన్ని రాష్ట్రాల్లో రికార్డులు బద్దలు కొట్టిన బాహుబలి
on Apr 29, 2017
బాహుబలి ది బిగినింగ్ విడుదలయినప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అంచనాలు వేరే రాష్ట్రాల్లో లేవు. హిందీ వెర్షన్ ని కూడా మొదట నామ మాత్రం గానే విడుదల చేశారు. కానీ, రిలీజ్ తర్వాత అంతటా పాజిటివ్ టాక్ తెచ్చుకొని కలెక్షన్స్ ఊపు మొదలయ్యింది. చివరికి, ఇండియా లోనే ఎక్కువ గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీ గా నిలిచింది. ఇంక బాహుబలి 2 ది కంక్లూజన్ విషయానికి వస్తే, విడుదలకి ముందు అంతటా భారీ అంచనాలున్నాయి. తెలుగు లోనే కాదు ఇతర భాషల్లో కూడా ప్రీ సేల్స్ అంచనాల్ని దాటి జరిగాయి. విడుదలయిన తర్వాత, సినిమా ఎక్సపెక్టేషన్స్ దాటి ఉండడంతో ఆకాశమే హద్దుగా సాగింది. హిందీ స్టార్లకే కళ్ళు బైర్లు కమ్మేలా బాహుబలి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామి సృష్టించింది. తాజా సమాచారం ప్రకారం, దేశ వ్యాప్తంగా తమిళనాడు లో తప్ప అన్ని రాష్ట్రాల్లో (30 ) మొదటి రోజుకి గాను అత్యధిక వసూళ్లు కొల్లగొట్టిన సినిమా గా నిలిచింది. ఫైనాన్సియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వడంలో డిలే వల్ల షోలు లేట్ గా పడడం, తమిళనాడు మొదటి రోజు కలెక్షన్స్ పై ప్రభావం చూపించింది. మహారాష్ట్ర, ఢిల్లీ ఇంకా ఇతర నార్త్ స్టేట్స్ లో కూడా బాహుబలి 2 తన సత్తా చాటింది. విడుదలకి ముందు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న, టైం కి అన్ని సర్దుకోవడంతో, కర్ణాటకలో బాహుబలి 2 ని భారీ గా విడుదల చేశారు. మొదటి రోజే దాదాపు 11 .69 కోట్లు కలెక్ట్ చేసి, ఆ స్టేట్ రికార్డు ని సాధించింది. సాహోరే బాహుబలి అంటే ఇదేనేమో...