మెగాస్టార్ అల్లుడితో చిన్నారి పెళ్ళికూతురు!
on Jan 25, 2021
అనువాద ధారావాహిక 'చిన్నారి పెళ్ళికూతురు'తో తెలుగువారికి చేరువయ్యింది అవికా గోర్. ఆపై 'ఉయ్యాల జంపాల'తో కథానాయికగా తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు.. 'సినిమా చూపిస్త మావ', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రాలతో అలరించింది. 'రాజుగారి గది 3' తరువాత మరో తెలుగు సినిమాలో కనిపించని ఈ టాలెంటెడ్ బ్యూటీ.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లో నాయికగా నటించే అవకాశం దక్కించుకుంది.
ఆ వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కథానాయకుడిగా శ్రీధర్ సీపాన దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీస్, ఏఏఏ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా, ఇందులో నాయికగా అవికా ఎంపికైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది ఈ అమ్మడు. మరి.. ఈ సినిమా తరువాత మరిన్ని మెగా కాంపౌండ్ మూవీస్ ఈ ముద్దుగుమ్మ చెంతకు చేరుతాయేమో చూడాలి.