నాకు సినిమాలు రాకుండా చేస్తోంది వాళ్లే!
on Sep 16, 2017
పాపం... అవికాగోర్. ఈ అమ్మాయికి ఎక్కడ లేని కష్టాలొచ్చాయ్. లేనిపోనివి సృష్టించి ఆ అమ్మాయి భవిష్యత్తుతో ఆడుకుంటున్నారట కొందరు ప్రభుద్దులు. ఈ విషయాన్నే సోషల్ మీడియాలో చెప్పుకొని బాధ పడింది ఈ చిన్నారి పెళ్లికూతురు. అవికా మీద ఎవరు పగపట్టారో తెలీదు కానీ... ఆ అమ్మాయి సినిమాలకు స్వస్తి చెబుతోందనీ, బహుశా త్వరలో పెళ్లి చేసుకుంటుందేమో అని కొత్త పుకారు లేవనెత్తారు. పైగా.. అనూహ్యంగా అవకాశాలు కూడా రావడం మానేశాయ్. దీనిపై ఆమె సోషల్ మీడియా ద్వారా తన గోడుని వెల్లబోసుకుంది. ‘కొందరు సీనియర్ సినీ సెలబ్రిటీలు కావాలనే నాపై పగబట్టి.. ఇలా చేశారు. నాకు అవకాశాలు కూడా ఇవ్వొద్దని వాళ్లే నిర్మాతలందరికి చెప్పారు. ఇక్కడ ప్రతిభకు స్థానం లేదు.’ అంటూ వాపోయింది అవికాగోర్.
అవికా.. మంచి అమ్మాయ్. బొద్దుగా ముద్దుగా ఉంటుంది. మంచి నటి.. ఈ క్వాలిటీలే అనతికాలంలోనే ఈ అమ్మాయికి మంచి పేరు తెచ్చిపెట్టాయ్. ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావా, ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రాల విజయాలు అవికాను మరింత ఎత్తులో నిలబెట్టాయ్. తను చేసిన సినిమాల్లో విజయాలే ఎక్కువ. కానీ... అవకాశాలు మాత్రం లేవు. ఇదే ఆశ్చర్యకరమైన విషయం.
మరి ఏమైందో ఏమో... ఈ పరిణామంపై అవికా భిన్నంగా స్పందించడం చర్చనీయాంశమైంది. చిత్ర పరిశ్రమలో మోనోపలి ఎక్కువ. మరి ఏ సీనియర్ సినీ సెలబ్రిటీ విషయంలో అవికా తప్పుగా ప్రవర్తించిందో అర్థం కావడంలేదు. అవికా... ఈ సీనియర్ సినీ సెలబ్రిటీలకు నచ్చందీ... ఏ విషయంలో? ప్రస్తుతం ఫిలింనగర్ లో ఇదే చర్చ.