కథక్ నేర్చుకుంటున్న అసిన్ మూడేళ్ల కూతురు.. రూపంలో అచ్చు అమ్మలాగే!
on Jun 13, 2021
బిజినెస్‌మ్యాన్ రాహుల్ శర్మను 2016 జనవరిలో పెళ్లాడింది 'అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి' ఫేమ్ అసిన్. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ద్వారా ఆ ఇద్దరూ ఒకరికొకరు పరిచయమయ్యారు. త్వరలోనే కలిసి జీవించాలని వారు నిర్ణయించుకున్నారు. పెళ్లి చేసుకున్నాక నటనకు స్వస్తి చెప్పిన అసిన్ రాహుల్‌తో పాటు ఢిల్లీకి వెళ్లి, తన జీవితంలోని కొత్త దశను ప్రారంభించింది.
అసిన్ వివాహమై ఇప్పటికి ఐదేళ్లు గడిచాయి. మూడేళ్ల క్రితం వాళ్లకు అరిన్ అనే కూతురు పుట్టింది. ఏదేమైనప్పటికీ అసిన్ తన పర్సనల్ లైఫ్‌ను మీడియాకు దూరంగా ఉంచుతూ వస్తోంది. ఆఖరుకి తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లోనూ చాలా అరుదుగా మాత్రమే తన ఫ్యామిలీ ఫొటోలను షేర్ చేస్తుంటుంది అసిన్. ఆమె ఒక పోస్ట్ పెట్టిందంటే మాత్రం అది అందరి దృష్టినీ తప్పకుండా ఆకర్షించాల్సిందే. లేటెస్ట్గా ఆమె షేర్ చేసిన ఫొటో కూడా అలాగే అందరినీ ఆకర్షిస్తోంది.
ఇప్పుడు అరిన్‌కు మూడేళ్లు. అసిన్ లేటెస్ట్గా షేర్ చేసిన పోస్ట్‌లో కథక్ ప్రాక్టీస్ చేస్తోంది అరిన్. ఫ్లవర్ డిజైన్ ఉన్న యెల్లో కలర్ ట్రెడిషనల్ డ్రస్‌లో చూడ ముచ్చటగా కనిపిస్తోంది. ఆ ఫొటోకు, "Weekend Kathak practice.. 3 year old" అంటూ క్యాప్షన్ పెట్టింది అసిన్.
అసిన్ సాధారణంగా పుట్టినరోజు సందర్భంగానో, లేదంటే ఏదైనా అకేషన్కో అరిన్ పిక్చర్స్‌ను షేర్ చేస్తుంటుంది. ఆమె పుట్టినప్పట్నుంచీ చూసుకుంటే చాలా కొద్ది సంఖ్యలోనే అరిన్ ఫొటోలను ఆమె షేర్ చేయడం కనిపిస్తుంది. అరిన్ పెరుగుతున్నకొద్దీ అచ్చుగుద్దినట్లు రూపంలో అమ్మను పుణికిపుచ్చుకున్నట్లే ఉంది.