పవన్‌కు నాలుగో భార్యగా నాకు ఓకే.. అషు రెడ్డి షాకింగ్ రియాక్షన్!
on Mar 2, 2021
డబ్స్మాష్ వీడియోల ద్వారా జూనియర్ సమంతగా గుర్తింపుని సొంతం చేసుకున్న అషు రెడ్డి ఇటీవల బిగ్‌బాస్ సీజన్ 3తో మరింతగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. గతకొన్ని వారాలుగా స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న 'కామెడీ స్టార్స్' షోలో ముక్కు అవినాష్‌తో కలిసి స్కిట్లు చేస్తూ నవ్వులు పూయిస్తోంది. అంతే కాకుండా హరి అనే కమెడియన్‌తో కలిసి లవ్ సాంగ్‌కి స్టెప్పులేసి స్టేజ్‌పైనే అతనికి హగ్ ఇచ్చి షాకిచ్చింది.
టీవీ షోలతో బిజీగా వున్న అషు రెడ్డి తాజాగా మళ్లీ వార్తల్లో నిలిచింది. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు తాను నాలుగో భార్యగా అయినా ఓకే అని స్టేట్మెంట్ ఇచ్చి వార్తల్లో నిలిచింది. గతంలో పవన్‌కల్యాణ్‌పై వున్న ప్రేమ, అభిమానం, క్రష్‌తో తన ప్రైవేట్ పార్ట్‌పై పవన్ పేరుని టాటూగా వేయించుకుని షాకిచ్చింది. తాజాగా మరోసారి పవన్‌ని కలిసిన అషు రెడ్డి తన గురించి పవన్ రాసిన లెటర్‌తో పాటు పవన్‌తో ప్రత్యేకంగా దిగిన ఫొటోని తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా అభిమానులతో పంచుకుంది.
ఈ సందర్భంగా "నా దేవుడు పవన్‌కల్యాణ్‌ని మళ్లీ కలుసుకున్నాను. తను నన్ను, నా టాట్టూని మరోసారి జ్ఞాపకం చేశారు. అలాగే నాకు టీని ఆఫర్ చేశారు. రెండు గంటలు నాతో సంభాషించారు. ఈ అనుభూతి చాలా స్వీట్‌గా అనిపించింది. వచ్చేటప్పుడు నాకు ఆయన ఓ స్వీట్ లెటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ ఎప్పుడూ నా ఫస్ట్ లవ్."` అని రాసుకొచ్చింది.
పవన్ రాసిన లెటర్ని కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ అషు రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. "ఒకవేళ నాలుగో భార్యగా పవన్మీకు అవకాశం ఇస్తే ఇప్పుకుంటారా?" అని ఓ నెటిజన్ అడిగితే వెంటనే "యస్" అనేసింది అషు రెడ్డి.
అషు రెడ్డి ఆన్సర్‌తో షాకైన ఇంకో అభిమాని "ఎటుపోతోంది ఈ సంఘం. నీకన్నా ముందు నాకే సిగ్గు అనిపిస్తోంది." అని ట్రోల్ చేశాడు.