రానా పెళ్లికి వెంకీ కూతురు మిస్సింగ్!
on Aug 8, 2020
మిహీకా బజాజ్ మేడలో శనివారం రాత్రి రానా దగ్గుబాటి మూడు ముళ్ళు వేయనున్నారు. వీళ్ళిద్దరూ ఏడడుగులు వేయనున్న శుభ ముహూర్తానికి మరెంతో దూరం లేదు. ఆల్రెడీ సందడి మొదలై చాలా గంటలు అయ్యింది. పసుపు-కుంకుమ, మెహందీ, సంగీత్ వేడుకలతో హుషారు హుషారుగా ఉన్నారు.
ఒక్కరు తప్ప దగ్గుబాటి కుటుంబం అంతా హైదరాబాద్లోని ఫిలింనగర్లో సురేష్ బాబు ఇంటికి చేరుకుంది. ఆ ఒక్కరూ వెంకటేష్ పెద్ద కుమార్తె, రానాకి చెల్లెలు అయ్యే ఆశ్రిత. అసలు, ఒక రకంగా ఈ పెళ్లి జరగడానికి... రానా, మిహీకా పరిచయానికి వెంకీ కుమార్తె కారణం.
ఆశ్రితకు మిహీకా క్లాస్మేట్. అప్పుడప్పుడూ తనను కలవడానికి దగ్గుబాటి ఇంటికి వచ్చి వెళుతుండేది. అలా రానాతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. అయితే, ప్రస్తుతం భర్తతో కలిసి స్పెయిన్లోని బార్సిలోనాలో ఆశ్రిత ఉంటోంది. కరోనా నేపథ్యంలో అక్కడి నుండి ఇక్కడికి ఆమె రావడం కుదరలేదని సమాచారం. అందువల్ల, అన్నయ్యతో స్నేహితురాలి పెళ్లికి మిస్ అవుతోందని టాక్.
Also Read