గల్లా జయదేవ్ కొడుకు హీరోగా వస్తున్నాడు!
on Nov 7, 2019
సూపర్‌స్టార్ మహేశ్ పెద్దబావ, గుంటూరు పార్లమెంట్ మెంబర్ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. 'భలే మంచి రోజు', 'శమంతక మణి', 'దేవదాస్' చిత్రాలతో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు.. కమర్షియల్ విజయాలను దక్కించుకున్న యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై పద్మావతి గల్లా (మహేశ్ పెద్దక్క) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నరేశ్, సత్య, అర్చనా సౌందర్య ఇప్పటివరకూ ఎంపికైన తారాగణం. జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
ఒక భిన్న కథాంశంతో ఎంటర్టైనర్గా ఈ మూవీని శ్రీరామ్ ఆదిత్య రూపొందించనున్నాడు. రామానాయుడు స్టూడియోలో నవంబర్ 10న గ్రాండ్ లెవల్లో జరగనున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరవుతున్నారు. కల్యాణ్ శంకర్, ఎ.ఆర్. ఠాగూర్ డైలాగ్స్ రాస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: రామాంజనేయులు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చంద్రశేఖర్ రావిపాటి, కథ, చిత్రానువాదం, దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య టి.