నేనింకా సెక్సీ సామ్నేనా?
on Aug 5, 2020
ఇటీవల సమీరా రెడ్డి షేర్ చేసిన వీడియో వైరల్ కావడంతో ఆమె హెడ్‌లైన్స్‌లో నిలిచింది. చూపులకు తాను బాగా కనిపించడం లేదని బాధపడుతున్న ఓ అమ్మకు ఆ వీడియోను పోస్ట్ చేసింది సమీరా. అందులో ఆమె తెల్లబడుతున్న జుట్టుతో కనిపించింది. లావైన గడ్డం, పొట్ట దగ్గర పెరిగిన కొవ్వును చూపించింది. తమ శరీరం గురించి ఎవరైనా ఎలా పాజిటివ్‌గా ఫీలవ్వాలో, తమ ఒరిజినాలిటీని యాక్సెప్ట్ చేసి దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం ఎంత ముఖ్యమో అందులో వివరించింది సమీరా.
తాజాగా ఆమె మరో పిక్చర్‌ను షేర్ చేసి, ప్రసవానంతరం తన బాడీ, మైండ్‌తో ఎలా డీల్ చేసిందో వివరంగా రాసుకొచ్చింది. ప్రసవం తర్వాత తాను డిప్రెషన్‌కు గురయ్యాననీ, దాన్ని ఎదుర్కోవడానికి పెద్ద స్థాయిలో మానసిక పోరాటం చేశాననీ తెలిపింది. ఏదేమైనా, ఇతర మహిళల గురించి ఆలోచిస్తూ, వాళ్లు తమ లోపాలను ఎలా డీల్ చేసి ఉంటారో అర్థం చేసుకుంటుంటే అది తనకు ఎంకరేజింగ్‌గా అనిపించింది చెప్పుకొచ్చింది. ప్రతి ఒక్కరికీ తమదైన ఒక స్పేస్ ఉంటుందనీ, ఒకరు ఇంకొకర్ని కిందికి లాగాల్సిన అవసరం లేదనీ చెప్పింది సమీరా. సుదీర్ఘంగా సాగిన తన ఎమోషనల్ పోస్ట్‌లో చివరగా పవర్ ఆఫ్ ట్రూత్ గురించి చెప్తూ ఎవరినైనా అది విడిపిస్తుందని అభిప్రాయపడింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో "నేను ఇప్పటికీ సెక్సీ సామ్నేనా? ఇప్పుడు నేను యమ్మీ మమ్మీ అనే బ్రాండ్ వేసుకోగలనా? నాకెంత మంది ఫాలోయర్స్ ఉన్నారు? నా విలువ ఇప్పటికీ చెల్లుబాటవుతుందా? నేనిప్పుడు మాజీ నటినా? కేవలం ఓ అమ్మనా? ఇది ఏప్రిల్ 2019 నాటి ఫొటో. ప్రజల దృష్టి నుంచి సుదీర్ఘ విరామంతో తిరిగి వస్తున్నాను. నేను ఎలాంటి ఇమేజ్ను ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నానని ఓ ఇండస్ట్రీ పర్సన్ అడిగారు" అంటూ ఆమె రాసుకొచ్చింది.