నన్ను తొక్కేశారు!
on Feb 1, 2018
కెరీర్ పరంగా మనం తీసుకునే నిర్ణయాలే మన అభివృద్ధిని నిర్ధేశిస్తాయ్. నా కెరర్ లో నేను కొన్ని తప్పులు చేశాను. ఈ రోజు నా కెరర్ అనునకున్న స్థాయిలో లేకపోవడానికి కారణం అవే. అంటూ వాపోయింది ‘బిగ్ బాస్’ ఫేం అర్చన. ఇంతకీ అర్చన చేసిన తప్పులేంటి? అనే విషయంలోకెళ్తే... తను ఇప్పుడు అటు హీరోయిన్ గా కాక, ఇటు కేరక్టర్ ఆర్టిస్ట్ గా కాక... రెంటికీ చెడ్డ రేవడిలా మిగిలిపోవడానికి కారణం ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమానే నట. ఆ సినిమా ఒప్పుకోకపోతే తన కెరీర్ మరోలా ఉండేదని ఆవేదన వ్యక్తం చేసింది అర్చన.
‘ఆ సినిమా విషయంలో వాళ్లు నాకు చెప్పిన కథ వేరు. తీసింది వేరు. అందులో నాది సెకండ్ హీరోయిన్ కేరక్టర్ అని ముందు చెప్పారు. కానీ..... సినిమాలో చూసుకుంటే అదో చిన్న పాత్ర. నిజంగా మోసం చేశారు. ఆ సినిమా తర్వాత నన్నందరూ కేరక్టర్ ఆర్టిస్ట్ గానే చూశారు తప్ప హీరోయిన్ గా చూడలేదు.
ఇండస్ట్రీలో ఎదగాలంటే బ్యాగ్రౌండ్ అయినా ఉండాలి. లేకపోతే ఆత్మాభిమానాన్నయినా వదులుకోవాలి. నాకు బ్యాగ్రౌండ్ లేదు. నేను అత్మాభిమానాన్ని వదులుకోలేను. అందుకే... ఇలా ఉండిపోయా. దాంతో రాజకీయాలకు బలైపోయా’ అని చెప్పుకొచ్చింది అర్చన.
సరైన మేనేజర్ లేకపోవడం కూడా తాను ఎదగలేకపోవడానికి ఓ కారణమనీ... ఇది చేయ్, ఇది చేయకు అని చెప్పే అభిరుచి ఉన్న వ్యక్తి నాకు తోడు లేకపోవడం వల్లే... జడ్జిమెంట్ లేక ఏది పడితే అది చేసి దెబ్బ తిన్నాననీ వాపోయింది అర్చన.