ఎన్టీఆర్ వేడుకకు వేదిక ఖరారు!
on Sep 29, 2018
త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం `అరవింద సమేత వీర రాఘవ` యొక్క ప్రీ రిలీజ్ అక్టోబర్ 2న భారీ స్థాయిలో జరగనుంది. హైదరాబాద్ ల్లోని నోవాటెల్ హోటల్ లో ఈ వేడుక జరగనున్నట్లు తాజా సమాచారం. తెలుగు రాష్ట్రాల నుండి ఎన్టీఆర్ అభిమానులు భారీగా రానున్నడంతో ఈ హోటల్ బాగుంటుందని అక్కడ జరుపుతున్నారు. ఇక వేడుకలో చిత్రం యొక్క ట్రైలర్ ను విడుదల చేసే అవకాశం ఉందట. త్రివిక్రమ్ దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం. హారిక హాసిని క్రియేషన్స్ పై ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ . అలాగే రాయలసీమ యాసలో చెప్పే డైలాగ్స్ హైలేట్ అవ్వనున్నాయి.ఈచిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నారు. ఈ సినిమా అక్టోబరు 11న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకానుంది.