ఆచార్యలో అరవింద్ విలనిజం?
on Nov 20, 2020
రోజా, బొంబాయి వంటి అనువాద చిత్రాలతో తెలుగువారికి చేరువైన తమిళ కథానాయకుడు అరవింద్ స్వామి. కోలీవుడ్ బ్లాక్ బస్టర్ తని ఒరువన్ తో విలన్ గా టర్న్ అయిన ఈ హ్యాండ్సమ్ హీరో.. అదే సినిమా తెలుగు వెర్షన్ ధ్రువలోనూ ప్రతినాయకుడిగా ఇక్కడివారిని ఆకట్టుకున్నారు. కాగా స్వల్ప విరామం తరువాత అరవింద్ మరో మెగా ప్రాజెక్ట్ లో బ్యాడీగా పలకరించనున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులోనే అరవింద్ స్వామి నెగటివ్ రోల్ లో దర్శనమివ్వనున్నారని ప్రచారం సాగుతోంది. త్వరలోనే అరవింద్ స్వామి ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
మరి.. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ సినిమాలో విలన్ గా అలరించిన అరవింద్ స్వామి.. ఇప్పుడు మెగాస్టార్ మూవీతోనూ మెప్పిస్తారేమో చూడాలి.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
