ఏప్రిల్ 9.. అప్పుడు మెగాస్టార్‌కు, ఇప్పుడు పవర్‌స్టార్‌కు!
on Apr 14, 2021
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రి-ఎంట్రీ మూవీగా తెరకెక్కిన 'వకీల్ సాబ్.. విడుదలైన అన్ని చోట్లా వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. 'అత్తారింటికి దారేది' తరువాత సరైన విజయం లేని పవన్..'వకీల్ సాబ్'తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చినట్లయ్యింది.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. పవన్ అన్న, మెగాస్టార్ చిరంజీవికి రెండు బ్లాక్‌బస్టర్స్ ని అందించిన ఏప్రిల్ 9నే 'వకీల్ సాబ్' కూడా థియేటర్స్ లోకి వచ్చింది. చిరు ఇండస్ట్రీ హిట్స్ లో ఒకటైన 'ఘరానా మొగుడు' (1992), సూపర్ హిట్స్‌లో ఒకటైన 'బావగారూ బాగున్నారా' (1998) విడుదలైన ఏప్రిల్ 9ని టార్గెట్ చేసుకుని 'వకీల్ సాబ్' కూడా జనం ముందుకు వచ్చింది. మెగా సెంటిమెంట్ ని రిపీట్ ని చేస్తూ.. ఎనిమిదేళ్ళ పాటు విజయానికి దూరమైన పవన్ కి ఆ లోటుని తీర్చినట్లయ్యింది. అలాగే.. నటుడిగా ఈ కోర్ట్ డ్రామాతో పవర్ స్టార్ మరో మెట్టు ఎదిగారన్నది విమర్శకుల మాట.
కాగా, ప్రస్తుతం పవన్ చేతిలో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి.. 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ కాగా.. మరొకటి 'హరిహర వీరమల్లు'. మూడోది హరీశ్ శంకర్ డైరెక్టోరియల్. ఈ మూడు సినిమాలు కూడా ఏడాదిలోపే సందడి చేసే అవకాశముంది.
Also Read