English | Telugu

పెట్రోల్ అమ్ముతున్న అనుష్క...

on Feb 4, 2018

 

అనుష్క ఏంటీ పెట్రోల్ బంకులో పెట్రోలు అమ్ముకుంటుంది ఏంటీ అనుకుంటున్నారా...?ఇదేదో సినిమా షూటింగ్ లో భాగం అనుకుంటున్నారా...? కాదులెండి.. ఓ సోషల్ కాజ్ కోసం ఆమె ఈ పని చేస్తుంది. గతంలో మంచు లక్ష్మీ "మేము సైతం" అనే పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించేవారు గుర్తుండే ఉంటుంది కదా. సెలబ్రిటీల ద్వారా ఇలాంటి పనుల చేయించి వాటి ద్వారా వచ్చిన డబ్బుతో పేదలను, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఇప్పుడు  ” మేము సైతం ”  ఫస్ట్ సీజన్ ముగిసిపోగా..రెండో సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి జరిగిన షూటింగ్ లో అనుష్క పాల్గొంది.  హైదరాబాద్ లోని ఫిలిం నగర్ రోడ్ నెం. 1 లో గల పెట్రోలు బంకులో అనుష్క పెట్రోలు అమ్మారు. ఇక అనుష్కను చూసేందుకు అభిమానులు  పోటీలు పడ్డారు. కాగా అనుష్క నటించిన ” భాగమతి ” సినిమా ఇటీవల విడుదలై మంచి హిట్ సాధించిన సంగతి తెలిసిందే.

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here