పాపం స్వీటీకి ఎన్ని కష్టాలో..!
on Aug 30, 2016
అనుష్కశెట్టి..సినిమాపై ప్రాణం పెట్టే అతికొద్ది మంది నటీమణుల్లో ఆమె ఒకరు. కథ నచ్చితే..పాత్ర కోసం ఎంతైనా కష్టపడే తత్వం అనుష్కది. అదే ఇప్పుడు ఆమెకు తిప్పలు తెచ్చిపెట్టింది. అసలు మ్యాటరేంటంటే సైజ్ జోరో సినిమాలో క్యారెక్టర్ కోసం కాస్త లావుగా కనిపించాలి. ఇందు కోసం అనుష్క ఒళ్లు చేశారు. అయితే ఆ సినిమా తర్వాత ఒప్పుకున్న మిగతా సినిమాల్లోని క్యారెక్టర్లు వెయిట్ తగ్గమని డిమాండ్ చేస్తున్నాయి. డిమాండ్ వరకు ఓకే కాని కొందరు దర్శకులు లావు తగ్గాల్సిందేనంటూ తెగ ఒత్తిడి చేస్తున్నారు. మొన్నామధ్య బాహుబలి-2 కోసం దర్శకుడు రాజమౌళి అనుష్కను సన్నబడాల్సిందిగా సున్నితంగా చెప్పాడట. దీంతో కాస్త అలిగిని అరుంధతి వెయిట్ తగ్గడం కోసం యోగా, జిమ్‌లో గంటల తరబడి ఇతర వ్యాయామాలు చేసింది. అయితే ఇవేవి అనుష్క వెయిట్‌ను దించలేకపోయాయి. చివరకు , హైదరాబాద్ రోడ్ల మీద సైక్లింగ్ చేస్తుందట స్వీటీ..జిమ్ అంటే నాలుగు గోడల మధ్యన చేసుకోవచ్చు. కానీ అనుష్క లాంటి సెలబ్రిటీ రోడ్ల మీద సైకిల్ తొక్కితే ఇంకేమైనా ఉందా...? అందుకే ఉదయాన్ని ముఖానికి మాస్క్ వేసుకుని 20 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతుందట . పాపం స్వీటీకి ఎన్ని కష్టాలో..