అనుష్క బ్యూటిఫుల్ ప్రెగ్నెన్సీ పిక్చర్.. విరాట్ క్యూట్ కామెంట్!
on Sep 14, 2020
విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ దంపతులు తమ అనుబంధాన్ని మరో లెవల్‌కు తీసుకుపోబోతున్నారు. తమ దాంపత్య జీవితంలో తల్లితండ్రులు అనే దశలోకి అడుగుపెట్టనున్నారు. కొన్ని వారాల క్రితం వారు ఈ న్యూస్‌ను ప్రపంచానికి పంచారు. అయితే తాజాగా ఎత్తుగా ఉన్న తన పొట్టను చూపిస్తూ అనుష్క్ షేర్ చేసిన పిక్చర్ ముచ్చటగా అనిపిస్తోంది.
ఆదివారం ఆమె తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో మెస్మరైజ్ చేసే ఓ అందమైన పిక్చర్‌ను షేర్ చేసింది. అది సముద్ర తీరం దగ్గర ఆమె నిల్చున్న పిక్చర్! తన ఎత్తైన పొట్టను చూసుకుంటున్న ఆమె ముఖంలో నవ్వు అందంగా వెల్లివిరుస్తోంది. వైట్ టాప్ ధరించిన ఆమె ఏంజెల్లా కనిపిస్తోందని చెప్పడం అతిశయోక్తి కాదు.
ఆ సమయంలో తనకు కలిగిన ఫీలింగ్స్‌ను పంచుకుంది అనుష్క. "మీలో జీవిత సృష్టిని అనుభవించడం కంటే వాస్తవమైందీ, హంబుల్ అయిందీ వేరేదేమీ లేదు. అది మీ నియంత్రణలో లేకపోతే, అప్పుడు నిజంగా అదేమిటి?" అంటూ ఆమె రాసుకొచ్చింది. భార్యను అమితంగా ప్రేమించే భర్తగా విరాట్, "My whole world in one picture." అంటూ దానికి అందమైన కామెంట్ జోడించాడు.
ఆగస్ట్ 27న అనుష్క ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని వారు ప్రకటించిన విషయం తెలిసిందే.