డైరెక్టర్‌కు మాజీ భార్య సపోర్ట్.. "చీపెస్ట్ స్టంట్" అని కామెంట్!
on Sep 20, 2020
డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌పై నటి పాయల్ ఘోష్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలను చీపెస్ట్ స్టంట్ అని అనురాగ్ మొదటి భార్య ఆర్తీ బజాజ్ కొట్టిపడేశారు. కొంతమంది అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంటే, మరికొంతమంది అతడిని వెనకేసుకొస్తున్నారు. తాప్సీ సైతం అనురాగ్‌కు సపోర్ట్‌గా నిలవగా, ఇప్పుడు మాజీ భార్య సైతం అతడికి మద్దతు తెలపడం గమనార్హం. అతడిని ఆమె రాక్‌స్టార్ అనికూడా అభివర్ణించారు.
పాయల్ ఘోష్ ఆరోపణలపై సోషల్ మీడియా ద్వారా స్పందించిన అనురాగ్ కశ్యప్ చేసిన పోస్ట్‌ను ఆర్తి స్క్రీన్‌షాట్ ద్వారా షేర్ చేసి, "ఇక్కడ మొదటి భార్యని.. నువ్వు రాక్‌స్టార్‌వి అనురాగ్. నువ్వు స్త్రీలను శక్తిమంతంగా చేస్తూ వస్తున్నావు, వాళ్లందరికీ అత్యంత సురక్షిత ప్రదేశాన్ని నువ్వు క్రియేట్ చేస్తావు. మన కూతురి విషయంలో దాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. ఇక్కడ సమగ్రత అనేది లేదు. ఈ ప్రపంచం అంతా పరాజితులతో నిండి ఉంది. గొంతును ఉపయోగిస్తున్న వాళ్లెవరికీ మెదళ్లు లేవు. ఇతరులను ద్వేషించడానికి వెచ్చించే శక్తిని ప్రతి ఒక్కరూ నిర్మాణాత్మక పనులకు ఉపయోగిస్తే ఈ ప్రపంచం మంచి ప్రదేశం అవుతుంది. ఇప్పటిదాకా నేను చూసినవాటిలో ఇది చీపెస్ట్ స్టంట్. మొదట ఇది నాకు కోపం తెప్పించింది. తర్వాత గట్టిగా నవ్వేశాను. ఇలాంటి విషయం గుండా నువ్వు వెళ్లాల్సి వస్తున్నందుకు సారీ. అది వాళ్ల స్థాయి. నువ్వు ఉన్నతంగానే ఉండు, నీ వాయిస్‌ను ఉపయోగిస్తుండు. వియ్ లవ్ యు" అని ఆమె పోస్ట్ చేశారు.
అంతకు ముందు తాప్సీ సైతం, తనకు తెలిసి అనురాగ్ అతిపెద్ద ఫెమినిస్ట్ అని అభివర్ణించింది. "మై ఫ్రెండ్, నాకు తెలిసి నువ్వు బిగ్గెస్ట్ ఫెమినిస్ట్‌వి. త్వరలో నిన్ను సెట్స్‌పై చూస్తాను. ప్రపంచంలో స్త్రీలు ఎంత శక్తిమంతులో, ఎంత ముఖ్యమైనవాళ్లో మీరు సృష్టించే కళ ద్వారా చూస్తాను" అని పోస్ట్ చేసింది.
Also Read