నా వయసు 21 ఏళ్లు అందరితోనూ పని చేస్తాను...!
on Feb 27, 2017
అనుపమ పరమేశ్వరన్... ఈ హీరోయిన్ పేరునే ఇప్పుడు టాలీవుడ్ జపం చేస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అ...ఆ చిత్రంలో కనిపించిన ఈ భామ జాతకం ఉన్నట్లుండి చటుక్కున మారిపోయింది. ఆమెకు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చేస్తున్నాయి. రీసెంట్గా ఈ అమ్మడు నటించిన ‘ప్రేమమ్’,‘శతమానం భవతి’ చిత్రాలు ఇటీవలే రిలీజై ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక ఈ చిత్రాల తర్వాత అనుపమ పరమేశ్వరన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్చరణ్ చిత్రాల్లో నటిస్తుందని వార్తలు వచ్చాయి.
ఇటీవల ఓ సందర్భంలో ఈ వార్తలు ఖండిస్తూ అనుసమ పరమేశ్వరన్ ఇలా మాట్లాడారు.. నన్ను ఎన్టీఆర్ చిత్రంలో నటించమని ఎవరూ అడగలేదు.. అలాగే రామ్చరణ్ చిత్రంలో నాకు హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఛాన్స్ మీస్ అయింది. అయినా నా వయసు ప్రస్తుతం 21 ఏళ్లు మాత్రమే. నాకు చాలా భవిష్యత్తు ఉంది. మున్ముందు అందరితోనూ పని చేసే అవకాశం దక్కుతుందని అనుకుంటున్నా. కాబట్టి చేజారిన అవకాశాల గురించి బాధపడట్లేదు’ అని తెలిపింది.