ఇక ఆ దర్శకుడిపైనే అను భారం!
on Jan 16, 2021
ఐదేళ్ళ కెరీర్.. మూడు భాషలు.. 11 సినిమాలు.. ఇదీ నాయిక అను ఇమ్మాన్యుయేల్ సినీ చరిత్ర. ఈ జర్నీలో చెప్పుకోదగ్గ ప్రయత్నాలే ఉన్నా.. నటిగా అనుకి సరైన గుర్తింపైతే దక్కలేదు. తెలుగులో ఆమె ఫస్ట్ రిలీజ్ మజ్ను ఓకే అనిపించినా.. ఆపై ఒక్క హిట్ కూడా అమ్మడిని విష్ చేయలేకపోయింది.
మరీ ముఖ్యంగా.. అజ్ఞాతవాసి, నా పేరు సూర్య వంటి బిగ్ టికెట్ ఫిల్మ్స్ అనుకి హై వోల్టేజ్ షాక్ నిచ్చాయి. శైలజారెడ్డి అల్లుడు తరువాత గ్యాప్ తీసుకుని మరీ అల్లుడు అదుర్స్ అంటూ జనం ముందుకు వస్తే.. ఈ అల్లుడు కూడా నిరాశపరిచాడు. దీంతో.. తెలుగులో అను ఇమ్మాన్యుయేల్ అంటే ఫ్లాప్ హీరోయిన్ అనే బ్రాండ్ పడిపోయింది.
ఈ నేపథ్యంలో.. తన ఆశలన్నీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ మహాసముద్రంపైనే పెట్టుకుంది. ఇందులో యువ కథానాయకుడు శర్వానంద్ కి జోడీగా నటిస్తోంది మిస్ ఇమ్మాన్యుయేల్. ఆర్ ఎక్స్ 100 వంటి సెన్సేషనల్ హిట్ తరువాత అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తున్న మూవీ కావడంతో.. ఇక తన ఆశల భారాన్ని అతగాడిపైనే మోపింది. మరి.. అనుకి అజయ్ అయినా సక్సెస్ ఇస్తాడా? వేచిచూడాలి.