రాజమౌళి ఒక ట్రెండ్ సెట్టర్
on Sep 17, 2017
రాజమౌళి ఒక ట్రెండ్ సెట్టర్ అంటూ ప్రశంసించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన ఏఎన్నార్ జాతీయ అవార్డ్ పురస్కారోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి ఆయన జక్కన్నకి అక్కినేని అవార్డును అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజమౌళి అక్కినేని అవార్డులకు అర్హులని, బాహుబలి అద్భుత కళాఖండమని..తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు పైకి ఎక్కించారని కొనియాడారు. తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్కు తరలిరావడం వెనుక ఏఎన్నార్ కృషి మరవలేనిదని..ఆయన ఎదుగుతూ తెలుగు సినిమాను అభివృద్ధి చేశారని కేసీఆర్ గుర్తు చేశారు.