ఎఫ్ 3లో మరో మెగా హీరో?
on Jan 20, 2021
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచిన చిత్రం ఎఫ్ 2. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందించిన ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్ కి ఇప్పుడు సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఎఫ్ 3 పేరుతో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ లోనూ ఎఫ్ 2లో నాయికలుగా నటించిన తమన్నా, మెహరీన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మల్టిటాలెంటెడ్ సునీల్ ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనున్నారు.
ఇదిలా ఉంటే.. ఎఫ్ 3లో కథను కీలక మలుపు తిప్పే ఓ పాత్ర ఉందట. అందులో సుప్రీమ్ హీరో సాయితేజ్ ని నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నాడట అనిల్ రావిపూడి. ఇప్పటికే అనిల్ డైరెక్షన్ లో సుప్రీమ్ వంటి సూపర్ హిట్ లో నటించిన సాయితేజ్.. పాత్ర హిలేరియస్ గా ఉండడంతో ఎఫ్ 3లో యాక్ట్ చేసేందుకు వెంటనే ఓకే చెప్పాడట. త్వరలోనే ఎఫ్ 3లో సాయి తేజ్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
ఎఫ్ 2ని నిర్మించిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నే ఎఫ్ 3ని ప్రొడ్యూస్ చేస్తుండగా.. తొలి భాగానికి బాణీలు అందించిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ నే ఈ సీక్వెల్ కి కూడా స్వరాలు అందిస్తున్నాడు.