'మహర్షి'లో మహేశ్ సెకండ్ లుక్ ఇదేనా?
on Sep 11, 2018
గడ్డం తీసేశారు..!! జుట్టు చిన్నగా కత్తిరించారు..!! టీనేజ్‌లో కాలేజ్‌కి వెళ్లే కుర్రాడిలా స్మైల్ ఇస్తున్నారు..!! మహేశ్‌బాబు సరికొత్త లుక్‌లోకి వచ్చేశారు..!! ఈ ఏడాది మహేశ్ లుక్ మార్చడం ఇది రెండోసారి. 'మహర్షి' కోసమే ఈ లుక్ అని టాక్. మహేశ్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా 'మహర్షి'. ఇందులో మహేశ్ జుట్టు, గడ్డం పెంచి కొత్త లుక్‌లో కనిపించనున్న సంగతి తెలిసిందే. డెహ్రాడూన్‌లో, గోవాలో చిత్రీకరించిన సన్నివేశాల్లో అదే లుక్‌లో కనిపిస్తారు. కథ ప్రకారం అమెరికాలో ఓ మేజర్ షెడ్యూల్ చేయనున్న సంగతి తెలిసిందే. అందులో మహేశ్ తాజా లుక్‌లో కనిపిస్తారని టాక్. అమెరికా నేపథ్యంలో వచ్చే సన్నివేశాల కోసం ఆయన లుక్ చేంజ్ చేశారట. మహేశ్‌బాబు తాజా లుక్‌ని ఆయన శ్రీమతి నమ్రతా శిరోద్కర్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు చూసినోళ్లంతా 'మహేశ్ ఎంత అందంగా వున్నాడ్రా బాబూ' అంటూ నోరెళ్లబెట్టక తప్పని పరిస్థితి. బహుశా... ఇటీవల కాలంలో ఒక సినిమా కోసం మహేశ్ రెండు లుక్స్ మైంటైన్ చేయడం ఇదే తొలిసారి అనుకుంట!! పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా అమెరికా షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది.