ఎస్పీబీ వర్థంతికి `అణ్ణాత్తే` టైటిల్ సాంగ్!
on Sep 18, 2021
సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ రోల్ లో నటిస్తున్న తమిళ చిత్రం `అణ్ణాత్తే`. `శౌర్యం` శివ డైరెక్ట్ చేస్తున్న ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ డ్రామా.. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. దీపావళి కానుకగా నవంబర్ 4న ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్స్ లో సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే.. వినాయక చవితి సందర్భంగా `అణ్ణాత్తే` ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన యూనిట్.. త్వరలో టైటిల్ సాంగ్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోందట. ఆ వివరాల్లోకి వెళితే.. గానగంధుర్వుడు
స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రమణ్యం గత ఏడాది ప్రథమార్ధంలో `అణ్ణాత్తే` టైటిల్ సాంగ్ ని ఆలపించారు. కాగా, ఇప్పుడీ పాటని ఎస్పీబీ వర్థంతి సందర్భంగా సెప్టెంబర్ 25న విడుదల చేయడానికి సన్నాహాలు
చేస్తున్నట్లు సమాచారం. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే మరో వారం రోజులు వేచిచూడాల్సిందే.
`అణ్ణాత్తే`లో నయనతార, కీర్తి సురేశ్, మీనా, ఖుష్బూ, జాకీష్రాఫ్, ప్రకాశ్ రాజ్, జగపతిబాబు ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా.. డి. ఇమాన్ స్వరాలు సమకూర్చారు. `రోబో` (2010) తరువాత వచ్చిన రజినీ
సినిమాలేవీ విజయం సాధించకపోవడంతో.. ఈ చిత్రంపై ఆశలు పెట్టుకున్నారు సూపర్ స్టార్ అభిమానులు.
Also Read