అంజలి సినిమా కూడా డైరెక్టుగా ఓటీటీలోకి
on Jul 5, 2020
ఓటీటీ వేదికలలోకి తెలుగు సినిమాల రాక నెమ్మదిగా మొదలైందని చెప్పవచ్చు. ఒక్కో సినిమా ఒక్కో సినిమా ఓటీటీ బాట పడుతున్నాయి. థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియని పరిస్థితులలో సినిమాలను ఓటీటీలకు అమ్ముకుంటున్నారు. ఆల్రెడీ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన 'కృష్ణ అండ్ హిజ్ లీల', నవీన్ చంద్ర హీరోగా నటించిన 'భానుమతి అండ్ రామకృష్ణ' ఓటీటీలలోకి వచ్చాయి. ఇప్పుడు అంజలి నటించిన సినిమా కూడా రాబోతోంది.
తెలుగమ్మాయి అంజలి, తమిళ హీరో జై, జననీ అయ్యర్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ కామెడీ 'బెలూన్'. ఇందులో రాజ్‌తరుణ్ అతిథి పాత్రలో నటించారు. శినీష్ దర్శకుడు. దిలీప్ సుబ్బరాయన్, అరుణ్ బాలాజీ, నందకుమార్ నిర్మాతలు. థియేటర్లలో కాకుండా 'జీ 5' ఓటీటీలో జూలై 10న ఈ సినిమా డైరెక్టుగా రిలీజ్ కానుంది.
జీవానంద్ (జై) ఓ స్ర్కిప్ట్ రాయాలని తన భార్య (అంజలి), మేనల్లుడు (మాస్టర్ రిషి)తో కలిసి ఊటీ వెళతాడు. అక్కడ ఓ పాత ఇంటిలో ఉంటాడు. గతాన్ని గుర్తుచేసే ఊహించని ఘటనలు జరుగుతాయి. తర్వాత ఏమైందనేది 'బెలూన్' కథ. ప్రజెంట్ ఫామ్ లో ఉన్న తమిళ కామెడీనా యోగిబాబు, తెలుగు యాక్టర్ నాగినీడు, జాయ్ మాథ్యూ, రామచంద్రన్ దురైరాజ్ తదితరులు నటించిన యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు.