అనిరుధ్‌కి అరుదైన అవకాశం!!
on Dec 11, 2018
వై దిస్ కొలవరి....సాంగ్ తో వరల్డ్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకున్నాడు సంగీత యువ తరంగం అనిరుధ్. తమిళం లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోన్న అనిరుధ్ కమల్ హాసన్, శంకర్ ల `భారతీయుడు-2` చిత్రానికి మ్యూజిక్ చేసే అరుదైన అవకాశం సంపాదించుకున్నట్లు తెలుస్తోంది. లోక నాయకుడు కమల్ హాసన్ , దర్శక దిగ్గజం శంకర్ కలయికలో `భారతీయుడు` చిత్రం వచ్చి ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే. అయితే వీరి కాంబినేషన్ లో సీక్వెల్ గా `భారతీయుడు-2` చిత్రం వస్తోన్న విషయం కూడా విదితమే. అయితే ఈ చిత్రం డిసెంబర్ 14న సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ డైరక్టర్ గా ఫైనల్ చేశారట శంకర్. ఇప్పటి వరకు ఏ ఆర్ రెహమాన్, హరీష్ జైరాజ్ లు శంకర్ సినిమాలకు పని చేశారు. ఈ అరుదైన అవకాశంతో అనిరుధ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయినట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో కమల్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. వెన్నెల కిషోర్ కూడా ఈ చిత్రంలో నటించే అవకాశం అందుకున్నాడు. ఈ చిత్రం కమల్ కి ఆఖరి చిత్రం కానుందట. ఆ తర్వాత కమల్ హాసన్ పూర్తిగా పాలిటిక్స్ కి అంకితమైపోనున్నాడట.