అనిల్ రావిపూడికి కొవిడ్ పాజిటివ్!
on Apr 18, 2021
పాపులర్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి కొవిడ్-19 పాజిటివ్‌గా టెస్ట్‌లో నిర్ధారణ అయ్యింది. దాంతో అతను డైరెక్ట్ చేస్తోన్న 'ఎఫ్3' మూవీ షూటింగ్‌ని పోస్ట్‌పోన్ చేశారు. 'ఎఫ్3' వర్క్‌తో కొంత కాలంగా అనిల్ రావిపూడి బిజీగా ఉన్నాడు. బ్లాక్‌బస్టర్ మూవీ 'ఎఫ్2'కు అది సీక్వెల్. ప్రస్తుతం అనిల్ క్వారంటైన్లో ఉన్నాడు. కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాతనే తిరిగి ఎఫ్3 షూటింగ్‌ను కొనసాగించనున్నాడు.
మైసూర్లో ఈ నెల 25 నుంచి షెడ్యూల్ ప్లాన్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దాన్ని పోస్ట్‌పోన్ చేశారు. ఈ మూవీలో వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ప్రధాన పాత్రధారులు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ మూవీకి దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
టాలీవుడ్లో కొన్ని రోజులుగా కరోనా కేసులు బయటపడుతూ వస్తున్నాయి. ఇటీవల పవన్ కల్యాణ్, అల్లు అరవింద్, త్రివిక్రమ్, దిల్ రాజు, బండ్ల గణేశ్ లాంటి సెలబ్రిటీలు కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అవడం, వారిలో గణేశ్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటుండటం తెలిసిందే. ఇలా నటులు, టెక్నీషియన్లు కొవిడ్ బారినపడుతుండటంతో షూటింగ్ షెడ్యూల్స్ కూడా డిస్టర్బ్ అవుతున్నాయి.
Also Read