బిగ్ బాస్ 3.. ఫస్ట్ ఎలిమినేట్ అయ్యే సెలబ్రిటీ శ్రీముఖి!!
on Jul 23, 2019
బిగ్ బాస్ మూడో సీజన్ మొదలైంది. ప్రారంభానికి ముందే వివాదాలతో బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న ఈ సీజన్.. ముందు ముందు ఇంకెన్ని వివాదాలతో క్రేజ్ పెంచుకుంటుందోనన్న చర్చ జరుగుతోంది. ఈ సీజన్.. బిగ్ బాస్ హౌస్ లోకి 15 మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు. వీరిలో ఆడియన్స్ ని మెప్పించి చివరివరకు నిలిచేది ఎవరు? ఆడియెన్స్ ని విసిగించి త్వరగా బయటికొచ్చేది ఎవరంటూ విపరీతంగా చర్చ జరుగుతోంది. అయితే అనూహ్యంగా.. హౌస్ నుంచి త్వరగా బయటికొచ్చే వారి లిస్ట్ లో యాంకర్ శ్రీముఖి పేరు వినిపిస్తోంది. శ్రీముఖికి యాంకర్ గా యూత్ లో మంచి క్రేజ్ ఉంది. తన కెరీర్ కూడా దూసుకుపోతోంది. ఇలాంటి సమయంలో ఓ షోలో పార్టిసిపేట్ చేయడం కోసం శ్రీముఖి తను హోస్ట్ చేస్తున్న షోస్ కి బ్రేక్ ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేసింది. సరే.. బిగ్ బాస్ కాన్సెప్ట్ నచ్చి వచ్చింది, చివరి వరకు ఉండి ఎంటర్టైన్ చేస్తోంది, టైటిల్ కూడా గెలవచ్చు అని ఆడియెన్స్ భావిస్తున్నారు.
అయితే శ్రీముఖి చివరివరకు ఉండరట. కేవలం షో కి హైప్ తీసుకురావడం కోసమే నిర్వాహాకులు ఆమెని తీసుకొచ్చారట. శ్రీముఖి కూడా కేవలం రెండు, మూడు వారాలు మాత్రమే హౌస్ లో ఉంటానన్న కండీషన్ మీద వచ్చారని ప్రచారం జరుగుతోంది. కెరీర్ పీక్ లో ఉన్న సమయంలో ఓ యాంకర్ వంద రోజులు ఇలా బందీ అయిపోయి.. మిగతా షోలకు దూరమవ్వడం నిజంగా కెరీర్ ని రిస్క్ లో పెట్టడమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. శ్రీముఖి కూడా అదే ఆలోచించి కేవలం రెండు మూడు వారాలు మాత్రమే హౌస్ లో ఉంటానని కండీషన్ పెట్టారట. నిర్వాహాకులు కూడా శ్రీముఖి వల్ల షో కి ఎంతో కొంత కచ్చితంగా ప్లస్ అవుతుందని భావించి.. భారీ రెమ్యూనరేషన్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిబట్టి చూస్తుంటే శ్రీముఖి త్వరగా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో.