శ్రీముఖి లవ్‌లో పడింది అతనితోనేనా..?
on Nov 7, 2016
అందంతో..తనదైన టైమింగ్‌తో బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా పేరు తెచ్చుకుంది శ్రీముఖి. ఒకవైపు యాంకర్‌గా బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాల్లోనూ అవకాశాలు పట్టేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. బుల్లితెరపై తనకు బాగా సన్నిహితుడైన ఒక వ్యక్తితో ఆమె పీకల్లోతు ప్రేమలో ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. యాంకర్లు ప్రేమలో పడినట్లు గతంలో ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. అందుకు శ్రీముఖి కూడా మినహాయింపు కాదు. అయితే తాను ప్రేమలో పడినట్లు వచ్చిన వార్తలను శ్రీముఖి కొట్టిపారేసింది. కానీ ఇప్పుడు తాజాగా వినిపిస్తోన్న వార్త మాత్రం చాలా గట్టిగానే ఉంది. వీరిద్దరూ చాలాకాలంగా తెర మీదే కాకుండా తెర వెనుక కూడా తెగ రాసుకుపూసుకుని తిరుగుతున్నారట. మరి ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయకతప్పదు. అలాగే ఈలోపు ఆ వ్యక్తి ఎవరో గెస్ చేయండి.