English | Telugu

ఎన్టీఆర్ కి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన యాంకర్.!!

on Oct 9, 2018

 

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా విడుదలకు సిద్దమైంది. ప్రస్తుతం ఎన్టీఆర్ 'అరవింద సమేత' ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మరణించారు. దీంతో సినిమా విడుదల ఆలస్యమవుతుందని అంతా భావించారు. కానీ ఎన్టీఆర్ నిర్మాతలకు నష్టం జరగకూడదని ఇచ్చిన మాట కోసం.. దుఃఖాన్ని దిగమింగుకొని షూటింగ్ లో పాల్గొన్నారు. దీంతో సినిమా అనుకున్న సమయానికి పూర్తై విడుదలకు సిద్ధమైంది. విషాదం నుండి ఇంకా పూర్తిగా బయటికి ఎన్టీఆర్.. టీవీ ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంలో ఓ యాంకర్ ఎన్టీఆర్ కి ఊహించని గిఫ్ట్ ఇచ్చారు.

ప్రముఖ యాంకర్‌, క్యారెక్టర్‌‌ ఆర్టిస్ట్‌ గాయత్రి భార్గవి ఎన్టీఆర్‌ను సర్‌ప్రైజ్‌ చేశారు. తన తాతగారు శంకర్‌ నారాయణ కొంతకాలం క్రితం గీసిన హరికృష్ణ చిత్రపటాన్ని ఎన్టీఆర్ కు కానుకగా ఇచ్చారు. ఈ కానుక చూడగానే ఎన్టీఆర్ కళ్లల్లో ఎంతో ఆనందాన్ని చూశానని తెలిపారు. ఈ విషయాన్ని గాయత్రి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘మా తాతగారు శంకర్‌ నారాయణ గీసిన చిత్రపటం తారక్‌కు అందింది. ఆ కానుకను చూసినప్పుడు తారక్‌ కళ్లల్లో నేను చూసిన ఆనందం వర్ణనాతీతం. ఈ కానుక తీసుకుంటూ..అమ్మకు ఇస్తానండీ అన్నారు' అంటూ ట్వీట్ చేసారు.

 


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here