English | Telugu

కాలు చూపించి కవ్విస్తున్న అనసూయ..

on Sep 6, 2017

బుల్లితెర యాంకర్‌గా ఓ ఊపు ఊపుతున్న అనసూయ‌ ఇప్పుడు మంచి పాపుల‌ర్ అయ్యింది. జబర్దస్త్ ద్వారా బాగా పేరు తెచ్చుకున్న అనసూయ.. ఆ తరువాత సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలతో నటిగా గుర్తింపు సంపాదించుకుంటోంది. క్షణం సినిమా తర్వాత తన ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. వరుస అవకాశాలు అనసూయను వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం అనసూయ సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా.. సమంత హీరోయిన్ గా వస్తున్న "రంగస్థలం 1985" సినిమాలో నటిస్తుంది.

అయితే ఇప్పుడు ఆసినిమాలో తనకు సంబంధించి ఫస్ట్ లుక్ ను పోస్ట్ చేసింది. ఫొటోను పోస్ట్ చేసి దానికి తప్పుడు నిజమైతే దిద్దుకో… అబద్ధమైతే నవ్వేసి ఊరుకే అని మాటలు కూడా రాసింది. దీంతో ఇప్పుడు ఈ చిత్రంలో అనసూయ క్యారెక్టర్ ఏంటబ్బా అని అనుకుంటున్నారు. అంతేకాదు కాళ్లకు పెట్టుకున్న పట్టీలు... అనసూయ మాటలకు.. బహుశా వేశ్వ పాత్రలో నటిస్తుందేమో అని రాసుకునే వాళ్లు కూడా ఉన్నారు. మరి ఇంతకీ ఈ సినిమాలో అనసూయ ఏ పాత్రలో నటిస్తుందో తెలియాలంటే కొంత సమయం వెయిట్ చేయాల్సిందే.

 

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here