ఇంద్రజ రాలేదు.. అనసూయ వస్తుందా?
on Jul 15, 2020
సుమంత్ అశ్విన్ సినిమాలో ఇంద్రజ నటించడం లేదు. కరోనా నేపథ్యంలో తాను చెన్నై నుండి హైదరాబాద్ రాలేననీ, ట్రావెలింగ్ చేయడం కుదరదనీ ఆమె విస్పష్టంగా చెప్పారు. దాంతో సెట్స్ మీదకు వెళ్లకముందే సినిమాకు ఓ సమస్య ఎదురైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సుమంత్ అశ్విన్, ప్రియ వడ్లమాని జంటగా ఒక సినిమా ప్రారంభమైంది. షెడ్యూల్ స్టార్ట్ అయ్యేలోపు కరోనా వచ్చింది. లాక్ డౌన్ వల్ల కుదరలేదు. ఇప్పుడు స్టార్ట్ చేద్దామని అనుకుంటే ఇంద్రజ రాలేనని చెప్పారు. అందుకని, ఆ పాత్ర కోసం అనసూయను అప్రోచ్ అయ్యారని టాక్.
రామ్ చరణ్ 'రంగస్థలం'లో రంగమ్మత్త, అడివి శేష్ 'క్షణం'లో ఏసీపీ జయా భరధ్వాజ్.... సినిమాలో పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటే అనసూయ చేస్తారు. మరి, ఈ సినిమా చేస్తారో? లేదో? చూడాలి. ప్రజెంట్ అనసూయతో డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇందులో హీరో శ్రీకాంత్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ఒక బైక్ రైడింగ్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
Also Read