రెండు వారాల గ్యాప్లో.. బోలెడు ఆశలు!
on Jan 17, 2021
'కాశి', 'విజిల్' వంటి తమిళ అనువాద చిత్రాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో మెరిసింది అమృత అయ్యర్. ఇక సంక్రాంతి కానుకగా విడుదలైన ఎనర్జిటిక్ స్టార్ రామ్ 'రెడ్' మూవీలో ఆదిత్యని ఆరాధించే అమ్మాయి గాయత్రిగా అమృత దర్శనమిచ్చింది. నటిగా మరోసారి మంచి గుర్తింపుని తెచ్చుకుంది.
కట్ చేస్తే.. 'రెడ్' విడుదలైన 15 రోజుల తరువాత మరో సినిమాతో పలకరించబోతోంది అమృత. ఆ చిత్రమే.. '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?'. యాంకర్ ప్రదీప్ మాచిరాజు కథానాయకుడిగా నటించిన ఈ ప్రేమకథా చిత్రం ఈ నెల 29న విడుదలకు సిద్ధమైంది. ఇందులో ఫుల్ లెన్త్ హీరోయిన్ రోల్ లో అమృత నటించింది. అభినయానికి అవకాశమున్న పాత్ర కావడంతో '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' పై బోలెడు ఆశలు పెట్టుకుంది అమృత.
మరి.. 'రెడ్' తో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న అమృత.. తక్కువ గ్యాప్ లోనే రాబోతున్న '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' తరువాత తెలుగునాట బిజీ హీరోయిన్ అయిపోతుందేమో చూడాలి.
Also Read