మెగాస్టార్ దంపతుల మధ్య విబేధాలు..?
on Jan 24, 2017
బాలీవుడ్లో బచ్చన్ ఫ్యామిలీపై ఎప్పుడూ ఏదో ఒక రూమర్ చక్కర్లు కొడుతూనే ఉంటుంది. మొన్నామధ్య ఐశ్వర్య-రణబీర్ కపూర్ రొమాన్స్‌పై పెద్ద దూమారం రేగి బచ్చన్ ఫ్యామిలీలో సునామీ సృష్టించింది..ఈ విషయంపైనే అభిషేక్-ఐశ్వర్యల మధ్య మనస్పర్థలు వచ్చాయని..త్వరలోనే వీరిద్దరూ విడిపోబోతున్నారంటూ వేడి వేడి వార్తలు వండి వర్చింది హిందీ మీడియా..కానీ రీసెంట్గా జరిగిన స్టార్ డస్ట్ అవార్డుల ఫంక్షన్లో అభిషేక్-ఐశ్వర్యలు అన్యోన్యంగా మెలిగి పుకారు రాయుళ్ల నోళ్లు మూయించారు.
ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్-జయాబచ్చన్ కలిసి ఉండటం లేదంటూ బాంబు పేల్చారు..అది చెప్పింది మామూలు వ్యక్తయితే ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు..కానీ ఆ విషయం చెప్పింది ఎవరో కాదు బచ్చన్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడుగా ముద్రపడ్డ అమర్‌సింగ్. ప్రజంట్ బిగ్‌బి-జయల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. వారు విడివిడిగా ఉంటున్నారు..ఒకరు ప్రతీక్షలో..మరోకరు జానక్లో నివాసం ఉంటున్నారంటూ అమర్‌సింగ్ చేసిన కామెంట్స్ బి-టౌన్లో సంచలనం సృష్టించాయి.. మరి వీటిపై బచ్చన్ ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో చూడాలి.