సల్మాన్ ఖాన్ పై అమీర్ విమర్శలు!
on Jul 5, 2016
"భజరంగీ భాయిజాన్" సినిమాలో సల్మాన్ నటనకు సాహో అంటూ కనీరుసైతం పెట్టిన అమీర్ ఖాన్ ఇప్పుడు సల్మాన్ పై నిప్పులు రువ్వుతున్నాడు. మొన్నామధ్య సల్మాన్ ఏమారపాటులో చేసిన "రేప్" కామెంట్ పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం బాలీవుడ్ ఖాన్ లలో సీనియర్ మరియు ప్రప్రధముడు అయిన షారుక్ ఖాన్ "నేను జడ్జ్ చేయలేను" అంటూ తప్పించుకోగా.. మరో ఖాన్ అమీర్ మాత్రం "ఆటాడలా మాట్లాడి ఉండకూడదు, ఆ వ్యాఖ్యలు హేయమైనవి అంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు.
అసలు వివాదాల జోలికి పోనీ అమీర్ ఖాన్ ఈ విధంగా స్పందించడంతో బాలీవుడ్ మీడియా సైతం ఆశ్చర్యపోయింది. అందునా స్నేహితుల్లాంటి ఈ ఖాన్ సహోదరులు మధ్యలో ఈ వ్యాఖ్య సరికొత్త సమస్యను తెచ్చిపెడుతుందా? లేక ఎలాగూ క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి లైట్ తీసుకొంటారా? అనేది చూడాలి!