'అంబాజీపేట మ్యారేజి బ్యాండు'.. మూవీ స్టార్ట్!
on Oct 16, 2021
కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సుహాస్.. 'కలర్ ఫోటో' సినిమాతో హీరోగా మారాడు. ఓ వైపు కమెడియన్ గా సినిమాలు చేస్తూనే.. మరోవైపు హీరోగా వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే ఫ్యామిలీ డ్రామా, రైటర్ పద్మభూషణ్ సినిమాలు చేస్తున్న సుహాస్.. మరో క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా పూజ కార్యక్రమాలు జరిగాయి.
సుహాస్ హీరోగా 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' అనే సినిమా ప్రారంభమైంది. 'కేరాఫ్ కంచరపాలెం' దర్శకుడు వెంకటేష్ మహా సమర్పణలో ధీరజ్ మోగిలినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో దుశ్యంత్ కటికనేని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా శనివారం లాంచనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టగా.. తొలి షాట్ కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు.
'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' నుండి ఒక పోస్టర్ విడుదలైంది. బ్యాండ్ మేళం కాస్ట్యూమ్స్ తో ఉన్న యువకుడు గ్రామంలోకి వెళ్తున్నట్టుగా ఉంది. అలాగే 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' టైటిల్ కింద "చింతలపూడి(గ్రా), అంబాజీపేట(మం), తూ.గో(జిల్లా), పిన్ కోడ్ 533294" అని రాసి ఉంది. టైటిల్, పోస్టర్ భిన్నంగా ఆకట్టుకుంటున్నాయి.
Also Read