ENGLISH | TELUGU  

మాల్దీవుల్లో అల్లు స్నేహారెడ్డి గ్లామ‌ర‌స్ షో!

on Apr 4, 2021

 

అల్లు అర్జున్‌, స్నేహారెడ్డి దంప‌తులు త‌మ కొడుకు అయాన్ ఏడ‌వ‌ పుట్టిన‌రోజును ఏప్రిల్ 3న సెల‌బ్రేట్ చేశారు. 'పుష్ప' షూటింగ్ నుంచి కొంచెం విరామం ల‌భించ‌డంతో త‌న ఫ్యామిలీతో మాల్దీవుల‌కు చెక్కేశాడు బ‌న్నీ. ఈ టూర్‌కు స్నేహారెడ్డి సిస్ట‌ర్స్ ఫ్యామిలీస్ కూడా తోడ‌య్యాయి. అమ్మానాన్న‌లు, ఆంటీలు, చెల్లెలు అర్హ‌, క‌జిన్స్ హ్యాపీ బ‌ర్త్‌డే చెప్తుండ‌గా కేక్ క‌ట్ చేశాడు అయాన్‌. మాల్దీవుల వెకేష‌న్‌కు సంబంధించిన అంద‌మైన ఫొటోల‌ను బ‌న్నీ, స్నేహ విడివిడిగా త‌మ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్ ద్వారా షేర్ చేశారు.

అయాన్ బ‌ర్త్‌డే కేక్ క‌ట్ చేస్తున్న ఫొటోను షేర్ చేసిన అర్జున్‌, "Many many happy returns of the day to my sweetest baby babu Ayaan . Your the love of my life. Wish u many more beautiful years to come . Love Nana." అంటూ రాసుకొచ్చాడు. అలాగే మ‌రో గ్రూప్ ఫొటో పోస్ట్ చేసి, దానికి "Ayaan Birthday Fam Jam" అనే క్యాప్ష‌న్ పెట్టాడు.

ఇక స్నేహారెడ్డి అయితే, త‌న క‌జిన్స్‌తో అయాన్ క‌లిసున్న పిక్చ‌ర్‌ను షేర్ చేసి, "#happybirthday #7Ayaan sweetest most affectionate child. Love u." అనే క్యాప్ష‌న్ పెట్టారు.

త‌ను స‌హా ఐదుగురు ఆడ‌వాళ్లు బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోను షేర్ చేసి, దానికి "#sistersquad" అనే హ్యాష్‌ట్యాగ్ పెట్టారు.

అయితే వీట‌న్నింటి కంటే మ‌రో ఫొటో నెటిజ‌న్ల‌ను ఎక్కువ‌గా ఆక‌ర్షిస్తోంది. అది స్నేహ సోలో ఫొటో. హ్యాట్ పెట్టుకొని డిజైన‌ర్ గౌన్ ధ‌రించి ఉంది స్నేహ‌. ఎడ‌మ కాలు పైదాకా అనాచ్ఛాదితంగా క‌నిపిస్తోంది. ఇలాంటి గ్లామ‌ర‌స్ డ్ర‌స్‌లో ఇంత‌దాకా ఆమె క‌నిపించ‌లేదు. ఆ ఫొటోకు, "Good times and tan lines" అనే క్యాప్ష‌న్ జోడించింది స్నేహ‌. మొత్తానికి మాల్దీవుల్లో స్నేహ గ్లామ‌ర‌స్ షో అదిరిందంటున్నారు నెటిజ‌న్లు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.