అల ...లో బన్నీ డ్యూయల్ రోలా??
on Aug 21, 2019
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో బన్నీ 'అల.. వైకుంఠపురములో' అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాలో బన్నీ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో ఒకటి సాఫ్ట్ వేర్ కుర్రాడు గా, మరొకటి గ్రామీణ కుర్రాడి పాత్రని తెలుస్తోంది. మరి దీని పై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక ఇటీవల గ్రామీణ కుర్రాడి పాత్రను రివీల్ చేసారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది కూడా. ప్రెజెంట్ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా లో బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. టబు కీలక పాత్రలో కనిపించనుంది. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. 2020 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.