ఆ సెంటిమెంట్ తోనే బన్నీ వస్తున్నాడా??
on Nov 9, 2018
సినిమా ఫీల్డ్ లో సెంటిమెంట్స్ ఎక్కువ అంటుంటారు. ఆ సెంటిమెంట్ తో కాంబినేషన్స్ సెట్స్ చేస్తుంటారు. సినిమాలు రిలీజ్ లు చేస్తుటారు. ఓపెనింగ్స్ చేస్తుంటారు. ఆడియ్ ఫంక్షన్స్ చేస్తుంటారు. ఇటీవల విజయ్ దేవరకొండని వంద కోట్ల క్లబ్ లో చేర్చిన చిత్రం `గీత గోవిందం`. ఈ చిత్రంతో ఒక్కాసారిగా విజయ్ క్రేజ్ అమాంతం పెరిగింది. దీని తర్వాత వచ్చిన నోట సినిమా కొంత నిరాశ పరిచింది. అయితే విజయ్ దేవరకొండ నటించిన `టాక్సీవాలా` చిత్రం ఈ నెల 17న వస్తోంది. లాస్ట్ సమ్మర్ లో నే విడుదల కావాల్సిన ఈ చిత్రం గ్రాఫిక్స్ కారణంగా డిలే అవుతూ వచ్చింది. అయితే ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 11న హైదరాబాద్ లో చేయనున్నారు. ఈ ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ రానున్నాడని ఇటీవల నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
`గీత గోవిందం` చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా విచ్చేసాడు అల్లు అర్జున్. ఆ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరిందా చిత్రం. ఆ సెంటిమెంట్ తో నే మళ్లీ `టాక్సీవాలా` ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ ని తీసుకొస్తున్నారంటూ ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది. చూద్దాం ఆ సెంటిమెంట్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో మరి. రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో యువి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.