English | Telugu

బ‌న్నీకి నిద్ర‌లేకుండా చేస్తున్న ఆ సినిమా!

on Apr 6, 2018

 

మెగా ఇంట్లో నిన్నా మొన్నటి వ‌ర‌కూ తిరుగులేని స్టార్‌గా చ‌లామ‌ణీ అయ్యాడు అల్లు అర్జున్‌.  సినిమాల ప‌రంగా, హిట్ల ప‌రంగా, క‌ల‌క్ష‌న్ల ప‌రంగా, అవార్డుల ప‌రంగా, ఫ్యాన్ మైలేజీ ప‌రంగా... బ‌న్నీనే నెంబ‌ర్ వ‌న్‌. ఈ రేసులో రామ్‌చ‌ర‌ణ్ వెనుకే ఉండేవాడు. ఇప్పుడు రంగ‌స్థ‌లంతో రామ్‌చ‌ర‌ణ్ బ‌న్నీని దాటుకుంటూ వెళ్లిపోయాడు. తొలిసారి రామ్‌చ‌ర‌ణ్ వంద కోట్ల మైలురాయి చూశాడు. రంగ‌స్థ‌లం తాజాగా రూ.130 కోట్లు కూడా దాటేసి 150 కోట్ల మైలు రాయివైపు దూసుకుపోతోంది. ఇప్పుడు ఈ అంకెలే బ‌న్నీకి నిద్ర‌లేకుండా చేస్తున్నాయి. త‌న స్టామినా నిరూపించుకోవాలంటే రంగ‌స్థ‌లం అంకెల‌న్నీ దాటేయాల్సిందే. లేదంటే బ‌న్నీకీ - చ‌ర‌ణ్‌కీ మ‌ధ్య పోలిక మొద‌లైపోతుంది. అల్లు అర్జున్ తాజా చిత్రం నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమాతోనే లెక్క‌ల‌న్నీ తేల్చేయాల‌ని బ‌న్నీ బాబు భావిస్తున్నాడు. బ‌న్నీ గ‌త సినిమాలేవీ వంద కోట్ల మైలు రాయిని అందుకోలేదు. ఈ నేప‌థ్యంలో రంగ‌స్థ‌లం రికార్డుల‌న్నీ దాటుకెళ్ల‌డం బ‌న్నీకి త‌ల‌కుమించిన ప‌నే. పైగా నా పేరు సూర్య ప‌బ్లిసిటీ అంతంత‌మాత్రంగానే ఉంది. ఈ సినిమాకి అంత‌గా బ‌జ్ కూడా రావ‌డం లేదు. రంగ‌స్థ‌లంలా సోలో రిలీజ్ దొర‌క‌డం లేదు. అన్నింటికి మించి నా పేరు సూర్య‌పై ఓ సీరియెస్‌యాక్ష‌న్ సినిమా అనే ముద్ర ప‌డిపోయింది. ఈ నేప‌థ్యంలో రామ్‌చ‌ర‌ణ్ రికార్డుల‌న్ని అందుకోవ‌డం, క‌నీసం ద‌రిదాపుల్లోకి వెళ్ల‌డం బ‌న్నీకి అసాధ్య‌మే అంటున్నాయి ట్రేడ్ వ‌ర్గాలు.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here