English | Telugu

బ‌న్నీని కొట్టే మొన‌గాడొచ్చాడు..

on Apr 4, 2018

 

మెగా ఇంట్లో స్టార్లు ఎంత‌మందైనా ఉండొచ్చు. కానీ న‌టుడు మాత్రం అల్లు అర్జున్ మాత్ర‌మే.  ఆర్య నుంచి..  గోన గ‌న్నారెడ్డి వ‌ర‌కూ ఏ పాత్ర తీసుకున్నా - అందులో విశ్వ‌రూపం చూపించేస్తుంటాడు బ‌న్నీ. ఎలాంటి ఎమోష‌న్ అయినా ఈజీగా ప‌లికించేస్తాడు. అందుకే.. స్టార్‌డ‌మ్‌తో పాటు `మంచి న‌టుడు` అనే కితాబూ అందుకున్నాడు.  మెగా ఇంట్లో చిరంజీవిని మిన‌హాయిస్తే బ‌న్నీ త‌ర‌వాతే ఎవ‌రైనా అనే స్థాయికి చేరుకున్నాడు. అయితే బ‌న్నీ స్థానానికి ఎస‌రు పెట్టేశాడు రామ్ చ‌ర‌ణ్‌. ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా... చ‌ర‌ణ్ స్థాయిని అమాంతంగా పెంచేసింది. అది `రంగ‌స్థ‌లం` అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. చ‌ర‌ణ్ చిరుత‌తోనే స్టార్ అయిపోయాడు. మ‌గ‌ధీర లాంటి క‌నీ వినీ ఎరుగ‌ని సినిమా అత‌ని ఖాతాలో ఉంది. అయినా ఎక్క‌డో ఏదో లోటు. చ‌ర‌ణ్‌లోని న‌టుడిపై ఎన్నో అనుమానాలు. చ‌ర‌ణ్‌తో పోలిస్తే బ‌న్నీ ఎక్క‌డో ఉండేవాడు. కానీ రంగ‌స్థ‌లంలో లెక్క‌ల‌న్నీ మారిపోయాయి. చ‌ర‌ణ్ త‌న రికార్డుల్నే కాదు.. ఇప్పుడు బ‌న్నీ రికార్డులూ తుడిచిపెట్టేశాడు. నటుడిగా విశ్వ‌రూపం చూపించాడు. బ‌న్నీకి పోటీగా మారిపోయాడు. ఇక మెగా ఇంట్లో న‌టులెవ‌రు? అని అడిగితే... చ‌ర‌ణ్‌పేరు ముందు చెప్పాలా?  బ‌న్నీ పేరు ముందు చెప్పాలా? అనే సందేహాన్ని క‌లిగించేలా న‌టించేశాడు చ‌ర‌ణ్‌. ఈ పోటీ మంచిదే. మెగా అభిమానుల‌కు ఇంత‌కంటే ఇంకేం కావాలి??  కానీ అది ఆరోగ్య‌క‌ర‌మైన పోటీగా మారాల‌ని వాళ్లు కోరుకుంటున్నారు. బ‌న్నీ.. త‌దుప‌రి సినిమాలో ఎలాంటి స‌మాధానం చెబుతాడో చూడాలి.

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here