అందులో బన్నీకి ప్రైవేట్ అకౌంట్!
on Apr 8, 2020
‘పెదవి దాటని మాటకు ప్రభువు నీవు. పెదవి దాటిన మాటకు బానిస నీవు’ అని పెద్దలు చెప్పారు. నోరు జారితే వ్యవహారం మామూలుగా ఉండదు. అందులోనూ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో నోరు జారితే రచ్చ రచ్చే. సెటైర్లు ఒక రేంజ్లో పడతాయి. బహుశా... ఇవన్నీ ఆలోచించే కాబోలు ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్ ప్రైవేట్ అకౌంట్ ఒకటి మెయింటైన్ చేస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్ ప్రైవేట్ అకౌంట్ పేరు ‘బన్నీ బోయ్ ప్రయివేట్’. దాన్ని ఎవరైనా ఫాలో అవ్వాలంటే అల్లు అర్జున్ పర్మిషన్ కావాల్సిందే. ‘‘ఏమీ ఆలోచించకుండా చెత్త పోస్ట్ చేయడానికి ఈ ప్రైవేట్ అకౌంట్. ఎందుకంటే... నాకు పిక్చర్స్ అంటే ఇష్టం’’ అని ఆ అకౌంట్లో పేర్కొన్నారు. ఇప్పటివరకూ ఆ అకౌంట్లో 755 పోస్టులు చేశారు. దాన్నుండి 335మందిని ఫాలో అవుతుంటే... ఆయన్ను ఫాలో అవుతున్నవారి సంఖ్య 245 మాత్రమే. కొంతమంది హీరోయిన్లు, మెగా ఫ్యామిలీ మెంబర్లు ‘బన్నీ బోయ్ ప్రైవేట్’ అకౌంట్‌ను ఫాలో అవుతున్నారు.
అఫీషియల్ అకౌంట్ ‘అల్లు అర్జున్ ఆన్లైన్’ నుండి బన్నీ చేసిన పోస్టులు తక్కువే. జస్ట్ 376 మాత్రయే. దానికి 6.1 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఆ అకౌంట్ నుండి వైఫ్ అల్లు స్నేహారెడ్డిని మాత్రమే ఫాలో అవుతున్నారు.
Also Read