కాస్ట్లీ కార్వాన్లో స్టైలిష్ స్టార్!!
on Jun 18, 2019
అవును మన స్టార్ హీరోలు షూటింగ్ టైమ్ లో కార్వాన్లు అత్యంత ఖరీదైన, అధునాతమైనవి వాడుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల అల్లు అర్జున్ ఒక విలాసవంతమైన కార్వాన్కు ఏడెనిమిది కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం అందుతోంది. మూడున్నర కోట్లతో కొన్న ఆ కార్వాన్కు అడిషనల్ మూడున్నర కోట్లు పెట్టి ఇంటీరియర్స్ డిజైన్ చేయించాడట. అల్లు అర్జున్ ( ఏఏ) సైన్ తో కూడిన కార్వాన్ తివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సెట్స్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిందట. అత్యాధునికంగా రూపొందించిన ఈ కార్వాన్ మన దేశంలోనే మొదటిదని తెలుస్తోంది. ముంబైకి చెందిన ఇంటీరియర్స్ దీనికి రూప కల్పన చేసారట. ప్రస్తుతం ఈ కార్వాన్ ఏఏ 19 సినిమా షూటిగ్ సెట్ లో అందర్నీ ఆకర్షిస్తోందట.