బన్నీ, విజయ్ దేవరకొండ.. ఓ మల్టిస్టారర్?
on Jan 27, 2021
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఓ మల్టిస్టారర్ రానుందా? అవునన్నదే ఫిల్మ్ నగర్ బజ్.
ఆ వివరాల్లోకి వెళితే.. ఆనందో బ్రహ్మ, యాత్ర చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న మహి వి. రాఘవ్ రీసెంట్ గా ఓ మల్టిస్టారర్ సబ్జెక్ట్ తయారుచేసుకున్నారట. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు యూత్ లో మంచి క్రేజ్ ఉన్న కథానాయకులని ఇందులో నటింపజేసే ప్రయత్నం చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే.. తాజాగా బన్నీ, విజయ్ దేవరకొండతో మహి చర్చలు జరిపారని, ఇద్దరు కూడా ఆసక్తి చూపించారని టాక్. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివరలో గానీ, వచ్చే ఏడాది ఆరంభంలోగానీ ఈ క్రేజీ మల్టిస్టారర్ పట్టాలెక్కే అవకాశముందంటున్నారు. మరి.. ఈ కథనాల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, ప్రస్తుతం బన్నీ యాక్షన్ థ్రిల్లర్ పుష్పతో బిజీగా ఉండగా.. విజయ్ స్పోర్ట్స్ డ్రామా లైగర్ చేస్తున్నారు. ఆపై కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ ఓ సోషల్ డ్రామా చేయనుండగా.. సుకుమార్ కాంబోలో విజయ్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఆయా చిత్రాలు ఓ కొలిక్కివచ్చాకే.. ఈ మల్టిస్టారర్ పట్టాలెక్కే అవకాశముంది.
Also Read