'ఆర్ఆర్ఆర్'కి ఆలియా వచ్చే ఏడాది వస్తుందా?
on Aug 7, 2020
'బాహుబలి' తరవాత దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఫిక్షనల్ హిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు కలిస్తే ఎలా ఉంటుందనే సినిమా కథ. భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరిగా రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. సీత పాత్రలో రామ్ చరణ్‌కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌ను సెలెక్ట్ చేశారు. ప్రజెంట్ ఆలియా తెలుగు క్లాసులు వింటున్నారట. అయితే, షూటింగ్లో మాత్రం ఈ ఇయర్ జాయిన్ కావడం కుదరదనీ, వచ్చే ఏడాది వస్తానని చెప్పారట.
ప్రజెంట్ షూటింగ్ చేసే సిట్యువేషన్స్ లేవు. ఒకవేళ షూటింగ్స్ స్టార్ట్ అయితే ఆలియా భట్ బాలీవుడ్ కమిట్మెంట్స్ కంప్లీట్ చేయాల్సి ఉందట. ముఖ్యంగా అన్నిటి కంటే ముందు రియల్ లైఫ్‌లో లవ్‌లో ఉన్న రణ్‌బీర్ కపూర్‌తో నటిస్తున్న 'బ్రహ్మాస్త్ర' సినిమా షూటింగ్ చేస్తుందట. ఇటీవల కరోనా సోకడంతో రాజమౌళి కూడా షూటింగ్ స్టార్ట్ చేయడానికి త్వరపడటం లేదు. అదీ సంగతి. ఆల్రెడీ 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ పొస్ట్‌పోన్ అయింది. పరిస్థితులు అనుకూలించకపోతే మరోసారి పొస్ట్‌పోన్ కావచ్చట.