‘అల...’ టీజర్ రివ్యూ: బన్నీ స్టైల్... త్రివిక్రమ్ మాయ!
on Dec 11, 2019
అల్లు అర్జున్ను అభిమానులు ముద్దుగా స్టయిలిష్ స్టార్ అని పిలుచుకుంటారు. ‘అల... వైకుంఠపురములో’ టీజర్ ఆ పిలుపుకు తగ్గట్టు స్టైల్‌గా ఉంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను మాటల మాంత్రికుడు అంటారు. కొందరు అభిమానులు ‘గురూజీ’ అని కూడా అంటారనుకోండి. ‘అల...’ టీజర్లో ఆయన మరోసారి మాయ చేశాడు. తన మాటలతో... ప్రేక్షకులు మెచ్చే విధంగా తీయడంలో!
అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ విజయాల తర్వాత వస్తున్న సినిమా ‘అల... వైకుంఠపురములో’. బుధవారం ఈ సినిమా టీజర్ విడుదలైంది. మొదటి 30 సెకన్లు హీరోను చాలా స్టైల్‌గా చూపించాడు త్రివిక్రమ్. పాట... ఫైటు... సీన్... అనే తేడా లేదు. ప్రతి ఫ్రేములో స్టైల్ నిండింది. ఎవరైనా దానిపై విమర్శిస్తారేమో అన్నట్టు... సెల్ఫ్ సెటైర్ వేసుకున్నారు త్రివిక్రమ్. ‘స్టైల్‌గా ఉంది కదా! నాక్కూడా నచ్చింది’ అని హీరో చేత డైలాగ్ చెప్పించారు. తర్వాత కథపై ప్రేక్షకులకు క్లారిటీ ఇచ్చేశారు. అల్లు అర్జున్‌కు పూజా హెగ్డే మేడమ్‌గా నటిస్తుందని చెప్పేశారు. హీరోయిన్ కంపెనీలో హీరో పని చేస్తాడన్నమాట! చివరలో విలన్ సముద్రఖనికి అల్లు అర్జున్ ఇచ్చే వార్నింగ్లోనూ త్రివిక్రమ్ పంచ్ కనపడింది. ‘మీరు ఇప్పుడే కారు దిగారు... నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కాను’ అంటూ హీరో చెప్తాడు. అప్పటివరకూ వినోదానికి, ఆ తర్వాత యాక్షన్‌కు లోటు ఉండదన్నట్టు ముందుగా హింట్ ఇచ్చారన్నమాట!
Also Read