ఎన్టీఆర్... చరణ్‌కు బన్నీ స్పెషల్ షో!
on Jan 11, 2020
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కజిన్స్! కలిసి పెరిగారు. హీరోలుగా కంటే ఇద్దరి మధ్య కజిన్స్‌గా మంచి అనుబంధం ఉంది. వీరిద్దరికీ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో మంచి స్నేహం ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్నారు. అంతకు ముందు ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఒకరి గురించి మరొకరు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ముగ్గురి గురించి ఎందురు చెప్తున్నామంటే... ఎన్టీఆర్, చరణ్‌కు బన్నీ స్పెషల్ షో వేస్తున్నాడని సమాచారం.
అల్లు అర్జున్ నటించిన తాజా సినిమా ‘అల వైకుంఠపురములో’. సంక్రాంతి కానుకగా ఆదివారం థియేటర్లలోకి వస్తోంది. అమెరికాలో మన కంటే ఒక రోజు ముందే విడుదలవుతోందనుకోండి. ఇక్కడ ఇండియాలో ఇద్దరు హీరోలు ప్రేక్షకుల కంటే ముందే సినిమా చూడనున్నారు. వాళ్ళే ఎన్టీఆర్, రామ్‌చరణ్. ‘ఆర్ఆర్ఆర్’ హీరోల కోసం అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ స్పెషల్ షో వేస్తున్నాడట! ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ సినిమా చేయనున్నాడని టాక్. ఈ సినిమాకు మందు కూడా ఎన్టీఆర్తోనే ‘అరవింద సమేత వీరరాఘవ’ చేశాడు. అటు చిరంజీవితో రామ్‌చరణ్ నిర్మాణంలో త్రివిక్రమ్ సినిమా చేయనున్నాడు. అటు అల్లు అర్జున్‌తో, ఇటు త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. అందరూ క్లోజ్. అందుకని, స్పెషల్ షోలు అన్నమాట!