English | Telugu

జెమినీ చేతికి అల్లు అర్జున్ 'అల...'

on Dec 7, 2019

సరికొత్త తెలుగు సినిమాల శాటిలైట్, డిజిటల్ రైట్స్ సొంతం చేసుకోవడంలో సన్ నెట్‌వర్క్ గ్రూప్‌కి చెందిన ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జెమినీ దూసుకుపోతోంది. నందమూరి బాలకృష్ణ 'రూలర్', రవితేజ 'డిస్కో రాజా', నితిన్ 'భీష్మ' శాటిలైట్ రైట్స్ ను జెమినీ టీవీ తీసుకుంది. ఇవే కాక మరికొన్ని క్రేజీ సినిమాలు జెమినీ చేతిలో ఉన్నాయి. 

తాజా సమాచారం ఏంటంటే... స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ 'అల వైకుంఠపురములో'. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్  సన్ నెట్‌వర్క్ గ్రూప్‌కి చెందిన ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫార్మ్ సన్ నెక్స్ట్ సొంతం చేసుకుంది. శాటిలైట్ రైట్స్ కూడా జెమినీ సొంతం చేసుకోబోతుందని టాక్. ఆల్రెడీ సినిమాలో పాటలు మూడు విడుదల అయ్యాయి. అందులో రెండు 'సామజ వరగమన', 'రాములో రాములా' హిట్టయ్యాయి. అందువల్ల, నిర్మాతలు కొంచెం ఎక్కువ రేటు చెబుతున్నప్పటికీ, జెమినీ వెనుకాడడం లేదట. ప్రస్తుతం 'అల వైకుంఠపురములో' షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సీఎంగా విడుదల కానుంది.


Cinema GalleriesLatest News


Video-Gossips